TG: కన్నబిడ్డలను చంపి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతులను బాపట్ల జిల్లా జనకారం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి (27), అవంతిక (9), భవన్ సాయి (7)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆపై ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.