స్పామ్ కాల్స్‌కు చెక్.. ట్రాయ్ కొత్త నిబంధనలు!

112చూసినవారు
స్పామ్ కాల్స్‌కు చెక్.. ట్రాయ్ కొత్త నిబంధనలు!
వినియోగదారులను వేధించే స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్ (TRAI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కస్టమర్ల ఫిర్యాదు లేకపోయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా స్పామ్ కాల్స్‌పై ఆటోమేటిక్‌గా చర్యలు తీసుకోవాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. నెట్‌వర్క్‌లోని AI సిస్టమ్‌లు స్పామ్ కాల్స్‌ను గుర్తిస్తాయి. తొలిసారి స్పామర్‌గా తేలితే 15 రోజులు అవుట్‌గోయింగ్ కాల్స్ నిలిపివేస్తారు, పదే పదే చేస్తే ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచుతారు. ప్రమోషనల్ కాల్స్ ఆపడానికి 1909 నంబర్‌కు BLOCK PROMO అని SMS పంపాలి.

సంబంధిత పోస్ట్