ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 5 కొత్త కోర్సులు
Jul 15, 2026, 16:07 IST/

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 5 కొత్త కోర్సులు

Jul 15, 2026, 16:07 IST
TG: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)కి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఎంఏ ఎడ్యుకేషన్‌, ఎంఏ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్‌), మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (MSW), ఎమ్మెస్సీ జాగ్రఫీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ) కోర్సులకు UGC ఆమోదం తెలిపింది. UGC నిపుణుల కమిటీ జూన్‌లో వర్చువల్‌గా తనిఖీ చేసి, మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బందిని పరిశీలించి ఈ కోర్సులకు ఆమోదం తెలిపిందని చక్రపాణి తెలిపారు.