ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు రైళ్ల ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ దుర్ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే శాఖ పలు రైలు సర్వీసులను రద్దు చేయడంతో పాటు, మరికొన్నింటిని దారిమళ్లించింది. ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు, దెబ్బతిన్న కోచ్‌లను తొలగించే పనులు కొనసాగుతున్నాయి.