టెక్కలి సమీపంలో రైలు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి

2చూసినవారు
టెక్కలి సమీపంలో రైలు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి
AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో నలుగురు యువకులు మృతి చెందారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనలో మరో యువకుడు గాయపడినట్లు తెలుస్తోంది. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్