ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చునార్ రైల్వే స్టేషన్‌లో భక్తులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఏడుగురు మృతి చెందారు. ప్లాట్‌ఫామ్ కాకుండా ట్రాక్‌పై భక్తులు దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలో స్నానం చేయడానికి వచ్చినట్లు తెలిసింది.