భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొమ్మిదో తరగతి విద్యార్థులకు 'యువికా-2026' పేరుతో ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. స్పేస్ టెక్నాలజీ, సైన్స్, అప్లికేషన్లపై అవగాహన కల్పించేందుకు ఈ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు ప్రయాణం, భోజనం, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తారు. STEM రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.