పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సామనా పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కోమల్ మహంత్ ఘన విజయం సాధించారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ తరఫున 18వ వార్డు నుండి పోటీ చేసి సమీప ప్రత్యర్థిపై 505 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆమె తన ప్రచారంలో డిజిటల్ మీడియాను వాడుకుని యువ ఓటర్లను ఆకర్షించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోమల్ మహంత్‌కు 64 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. యువత సంక్షేమం, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆమె ప్రకటించారు.