TG: హైడ్రా ‘ఈగల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు
ఉద్యోగాలు లభించాయి. మొత్తం 16 మంది ట్రాన్స్‌జెండర్లకు అవకాశం లభిచడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘హైడ్రా ఈగల్ టీమ్’గా ప్రత్యేక గుర్తింపు పొందిన వీరు అమీన్‌పూర్, మాదాపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమాజంలో గౌరవంతో పాటు ఆర్థిక భరోసా కూడా లభించిందని వారు తెలిపారు. గతంలో భిక్షాటనపై ఆధారపడిన తాము ఇప్పుడు బాధ్యతగా విధులు నిర్వహిస్తూ కొత్త జీవితం ప్రారంభించామని పేర్కొన్నారు.