
రైళ్ల భద్రతకు ఏఐ నిఘా.. రైల్వే శాఖ కీలక అడుగు
ప్రయాణికుల భద్రత, రైళ్ల రక్షణ కోసం ఇండియన్ రైల్వే అధునాతన సాంకేతికతను అవలంబిస్తోంది. రైల్వే స్టేషన్లు, రైళ్ల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నిఘా, డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. రైళ్లు, పట్టాల వెంట అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.




