
ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి.. సీసీ ఫుటేజ్
TG: ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్ సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. వీధికుక్క దాడిలో బాలుడి ముఖంపై గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అరవడంతో బాలుడిని విడిచిపెట్టింది. దీంతో బాలుడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గాజుల రామారం సర్కిల్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందన లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




