చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను తగ్గించేందుకు ఇస్రో ఉపగ్రహ ఆధారిత భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని ట్రాన్స్‌పాండర్‌గా పిలుస్తూ, పశ్చిమ బెంగాల్‌లోని కాక్‌ద్వీప్ సబ్‌డివిజన్‌లో ప్రారంభించారు. తొలి దశలో 300 పడవల్లో ఈ పరికరం ఏర్పాటు చేశారు. ఫ్యూచర్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అన్ని ట్రాలర్లలో దీనిని విస్తరించాలని మత్స్యశాఖ యోచిస్తోంది.