పాత వాహనాలకు HSRP నంబర్ ప్లేట్.. గడువుపై రవాణా శాఖ కీలక ప్రకటన

30026చూసినవారు
పాత వాహనాలకు HSRP నంబర్ ప్లేట్.. గడువుపై రవాణా శాఖ కీలక ప్రకటన
TG: పాత వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లు (HSRP) బిగించేందుకు ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. “సెప్టెంబర్ 30 లోగా HSRP నంబర్ ప్లేట్ తప్పనిసరిగా బిగించకపోతే ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు జరిమానాలు విధిస్తారు” అనే వార్తలు అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి గడువు సంబంధిత అధికారిక ఉత్తర్వులు ఇంకా రవాణా శాఖకు అందలేదని తెలిపింది.

సంబంధిత పోస్ట్