AP: కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు కలప గుజ్జును దేశంలోనే తొలిసారిగా రైలులో రవాణ చేశారు. ఇప్పటివరకు 1,061 కి.మీ. దూరం రోడ్డు మార్గంలో రవాణా చేస్తున్న కలప గుజ్జును రైలుమార్గానికి మళ్లించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. గూడ్స్ టారిఫ్ క్లాస్-110 కింద చేర్చి రవాణా ఛార్జీలు తగ్గించడంతో పరిశ్రమలు రైలు రవాణాకు మొగ్గుచూపాయి. ఒక్కో రేక్ ద్వారా సుమారు రూ.40 లక్షల ఆదాయం, ఏడాదికి 1.5 లక్షల టన్నుల అదనపు లోడింగ్‌తో రూ.20 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.