హైదరాబాద్‌లోని మొయినాబాద్ చెర్రీవోక్స్ ఫాంహౌస్‌లో జరిగిన ట్రాప్‌హౌస్ పార్టీపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమాచారంతో పార్టీలో 65 మంది పాల్గొనగా, వారిలో 22 మంది మైనర్లు ఉన్నారు. కెనడా నుంచి వచ్చిన ఇషాన్ పార్టీ ఆర్గనైజర్‌గా గుర్తించారు. ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి, 6 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ కాగా, ఆరుగురిపై కేసు నమోదైంది.