TG: హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఒకే స్కూటీపై నలుగురు పిల్లలను ప్రమాదకరంగా తీసుకెళ్తున్న వ్యక్తి కనిపించాడు. స్కూటీపై కూర్చునేందుకు స్థలం లేకపోవడంతో ఒక బాలుడు వెనుక భాగంలో నిల్చొని ప్రయాణించడం కెమెరాలో నమోదైంది. ఇలాంటి నిర్లక్ష్యమైన ప్రయాణాలు ప్రమాదాలకు దారితీస్తాయని, పిల్లలను ఇలా తరలించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు అని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు.