69 బంతుల్లో ట్రావిస్ హెడ్‌ సెంచ‌రీ.. వీడియో

9400చూసినవారు
పెర్త్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళ్తోంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో సులువు చేశాడు. కేవలం 69 బంతుల్లోనే శతకం సాధించిన హెడ్, 12 ఫోర్లు, 4 సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. ఇది టెస్టుల్లో అతనికి పదో సెంచరీ. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్, రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియాకు లక్ష్యం సులభమైంది. ఇంగ్లండ్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయారు.

సంబంధిత పోస్ట్