మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఒక గిరిజన మహిళను అదృష్టం వరించింది. రాజ్‌పూర్‌కు చెందిన వినీతా గోండ్ తాను లీజ్‌కు తీసుకున్న పటీ గని ప్రాంతంలో మూడు వజ్రాలను కనుగొన్నారు. వీటిలో ఒకటి 1.48 క్యారెట్లు, మిగతావి 20, 7 సెంట్ల బరువున్నాయి. మూడు వజ్రాల్లో ఒకటి అత్యుత్తమ నాణ్యత కలిగిందని జిల్లా అధికారి అనుపమ్ సింగ్ తెలిపారు. ఈ వజ్రాలను త్వరలో వేలం వేయనున్నారు.