పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా శీరాంపూర్లో TMC ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. మమతా బెనర్జీ నిర్వహించనున్న బహిరంగ సభకు వెళ్తుండగా గుంపు ఆయన కారును చుట్టుముట్టి ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేసింది. దాడిలో కారు వెనుక అద్దం ధ్వంసమైంది. దీంతో ఘోష్ పర్యటన రద్దు చేసుకుని కోల్కతాకు తిరిగి వెళ్లారు. ఘటనపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.