యూపీలోని సీతాపూర్ జిల్లా సక్రన్ PS పరిధిలోని మహారాజ్‌గంజ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ, ఒక బాలుడు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన తర్వాత ట్రక్కు కూడా అదుపుతప్పి బోల్తా పడింది. పోలీసులు తాడు సహాయంతో ట్రక్కులోని ఖలాసీని సురక్షితంగా బయటకు తీశారు.