TG: బైక్‌ను ఢీకొట్టిన ఓ ట్రక్కు 5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని మావల బైపాస్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆత్రం రాంజీ (40) అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. హైవేపై ఆదిలాబాద్ వైపు వెళ్తున్న రాంజీని వెనుక నుంచి వచ్చిన కంటెయినర్ ట్రక్కు ఢీకొట్టింది. బైక్ ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోయినా డ్రైవర్ ఆగకుండా సుమారు 5 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. పోలీసులు ట్రక్కును వెంబడించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.