ఈజిప్టులో జరిగిన ప్రపంచ దేశాధినేతల సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని అందంగా ఉన్నారని ప్రశంసించారు. అమెరికాలో ఇలా చెబితే తన రాజకీయ జీవితం ముగుస్తుందని, అయినా ఈ అవకాశాన్ని తీసుకుంటున్నానని, ఆమె అందంగా ఉన్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.