అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మలేషియా పర్యటనలో ఆనందంతో సంప్రదాయ నృత్యానికి స్టెప్పులేశారు. ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం కౌలాలంపూర్ చేరుకున్న ఆయనకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో మలేషియా బృందం చేస్తున్న సంప్రదాయ నృత్యాన్ని చూసి ముచ్చటపడి వారితో కలిసి డ్యాన్స్ చేశారు. ఈయనతోపాటు మలేషియా ప్రధాని కూడా స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.