టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

0చూసినవారు
టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన 10 శాతం సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 2-1 తేడాతో ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ట్రంప్ యంత్రాంగం మళ్లీ 10 శాతం తాత్కాలిక టారిఫ్‌లను విధించగా, వీటిని వ్యతిరేకిస్తూ 24 అమెరికా రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తాజాగా విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు, ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది.

సంబంధిత పోస్ట్