
నాలుగో రోజు కాత్యాయని దేవిగా కనకదుర్గమ్మ (వీడియో)
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు భక్తుల సందడితో కొనసాగుతున్నాయి. నాలుగో రోజు కనకదుర్గమ్మ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు క్యూలైన్లలో నిలబడి అమ్మవారి కృప కోసం ప్రార్థనలు చేస్తున్నారు.




