H-1B వీసాపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు

6854చూసినవారు
H-1B వీసాపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు
అమెరికాలో ఉద్యోగం, డాలర్ జీతం ఆశించే భారతీయ ఐటీ నిపుణులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. కొత్త H-1B వీసాలపై విధించిన రూ. 83 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు నిబంధనను 2027 సెప్టెంబర్ 21 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా వెలుపల ఉన్న నిపుణులను H-1B వీసా ద్వారా నియమించుకోవాలంటే కంపెనీలు ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. అమెరికా స్థానిక ఉద్యోగాలను పరిరక్షించడం, H-1B ప్రోగ్రామ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.

సంబంధిత పోస్ట్