ఇరాన్‌తో చర్చల్లో ట్రంప్‌కు అవమానం: మెర్జ్

1చూసినవారు
ఇరాన్‌తో చర్చల్లో ట్రంప్‌కు అవమానం: మెర్జ్
ఇరాన్‌తో శాంతి చర్చల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవమానం ఎదుర్కొన్నారని, యుద్ధాన్ని ఆపేందుకు మార్గం కనుగొనలేకపోతున్నారని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్‌రిచ్ మెర్జ్ పేర్కొన్నారు. ఇరాన్ చాకచక్యంగా చర్చలు నిర్వహిస్తోందని, అమెరికాకు పశ్చిమాసియా సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు దొరకడం లేదని విమర్శించారు. వెస్ట్రన్ జర్మనీలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం వల్ల జర్మనీలో కూడా ఇంధన ధరలు పెరిగాయని, దీనిపై మెర్జ్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్