రష్యా చమురు దిగుమతుల కారణంగా భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించగా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. రష్యా ఆయిల్ ఆదాయాన్ని తగ్గించేందుకు, ఉక్రెయిన్ దాడులను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఎన్‌బీసీకి చెప్పారు. భారత్‌పై సెకండరీ టారిఫ్స్ కూడా ఆర్థిక ఒత్తిడిలో భాగమేనని, దాడులు ఆపితే మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి రష్యాను ఆహ్వానించవచ్చని అన్నారు.