అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో దేశానికి సేవలందించేందుకు అన్ని విధాలా యోగ్యంగా ఉన్నారని శ్వేతసౌధం వైద్యులు వెల్లడించారు. ఈ నెల 26న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో 22 మంది నిపుణులు ట్రంప్‌కు పలు వైద్య
పరీక్షలు నిర్వహించినట్లు ఆయన అధికారిక వైద్యుడు షాన్ బార్బెల్ తెలిపారు. వచ్చే నెలలో 80వ ఏట అడుగుపెట్టనున్న ట్రంప్ 108 కిలోల బరువుతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల ఆయన చేతులపై కనిపించిన మచ్చలు తరచూ కరచాలనం చేయడం వల్ల ఏర్పడిన స్వల్ప కణజాల సమస్యగా వివరించారు.