
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అమెరికా కీలక ప్రకటన
అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు ఆగస్టు 15ను భారత స్వాతంత్య్ర దినోత్సవంగా ప్రకటించాయి. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోకుల్, న్యూజెర్సీ గవర్నర్ మైకీ షెర్రిల్ ఈ ప్రకటనలు చేశారు. భారత స్వాతంత్య్ర ప్రయాణం, ఇండో-అమెరికన్ సమాజం సేవలను గుర్తించి ఈ ప్రకటనలు వెలువడ్డాయి. భారత కాన్సులేట్ న్యూయార్క్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ప్రకటనలు ఇండియా, అమెరికా పంచుకునే ప్రజాస్వామ్య విలువలను హైలైట్ చేస్తున్నాయని కాన్సులేట్ తెలిపింది. గతంలో మసాచుసెట్స్ గవర్నర్, బోస్టన్ మేయర్ కూడా ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటించారు.




