భారతీయ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్

41చూసినవారు
భారతీయ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్
అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ద్వారా ఉద్యోగం చేసే వారికి 1 లక్ష డాలర్లు (సుమారు రూ.90 లక్షలు) ఫీజు విధించే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపైనే ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికన్ ఫస్ట్ విధానంలో భాగంగా విదేశీయుల ఉపాధిని నియంత్రించడమే లక్ష్యమని సమాచారం. అయితే దీనిపై అధికారిక తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్