అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న ఆమె.. భర్తతో కలిసి ప్రఖ్యాత స్వామి నారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలను చూసి వారు ముగ్ధులయ్యారు. ఆలయ ఆవరణలో 108 అడుగుల నీలకంఠ్ వర్ణి విగ్రహాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన SMలో పంచుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా టిఫానీ ఆగ్రా వెళ్లి తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు.