దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆరేళ్ల తర్వాత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ చేస్తున్న కృషి అభినందనీయమని జిన్‌పింగ్ కొనియాడారు. ముఖ్యంగా గాజాలో కాల్పుల విరమణకు తీసుకున్న చర్యలను, అలాగే కంబోడియా, థాయ్‌లాండ్ సరిహద్దు ఉద్రిక్తతల్ని తగ్గించడం గొప్ప విషయమని ప్రశంసించారు.