
పరకామణి కేసులో హైకోర్టు కీీలక ఆదేశాలు
AP: తిరుమల పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని పేర్కొంది. అలాగే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలంది. మాజీ ఏవీఎస్ఓ పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. పరకామణి కేసును సీఐడీ, ఏసీబీ అధికారులు వేర్వేరుగా విచారణ చేయవచ్చని అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.




