అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించేందుకు సంకేతాలు ఇచ్చారు. సోమవారం వైట్‌హౌస్‌లో అమెరికన్ రైస్ రైతులతో జరిగిన సమావేశంలో.. భారత్, థాయ్‌లాండ్, చైనా వంటి దేశాలు భారీ సబ్సిడీలతో బియ్యాన్ని తక్కువ ధరలకు అమెరికా మార్కెట్‌లో డంప్ చేస్తున్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ట్రంప్.. భారత్ బియ్యంపై అదనపు సుంకాలు విధిస్తామని, ఇకపై ఇలాంటి డంపింగ్‌ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.