అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటన సందర్భంగా రాజు చార్లెస్‌కు బహూకరించేందుకు ఐసన్‌హోవర్ మ్యూజియంలోని పురాతన ఖడ్గాన్ని కోరగా నిర్వాహకులు నిరాకరించారు. అది అమెరికా చారిత్రక ఆస్తి అని తేల్చి చెప్పారు. దీనితో లైబ్రరీ డైరెక్టర్ టోడ్డ్ ఆరింగ్టన్‌కు ఉద్యోగంలో ఉంటావా.. పీకిపారేయాలా అని ట్రంప్ కార్యవర్గం నుంచి ఫోనొచ్చింది. అయినా సరే నిర్వాహకుడు ఆ కత్తి కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. చివరికి మెలానియా ట్రంప్ ఖడ్గం నమూనాను చార్లెస్‌కు బహూకరించారు.