
అవి ఉంటే పిడుగులు పడినా ఏం కాదా?(వీడియో)
వర్షాకాలంలో పిడుగులు ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతుంటాయి. ఇళ్లపై, ఆఫీసులపై, పరిశ్రమలపై ఏర్పాటు చేసే లైట్నింగ్ కండక్టర్లు, అరెస్టర్లు పిడుగును ఆపలేవు, కానీ దాని దిశ మార్చి భూమిలోకి సురక్షితంగా మళ్లిస్తాయి. నిపుణుల ప్రకారం, పిడుగు ఎక్కడ పడుతుందో ముందుగానే కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. కానీ పిడుగు పడినప్పుడు లైట్నింగ్ రాడ్ దానిని ఆకర్షించి, అనుసంధానం చేసిన మెటల్ వైర్ ద్వారా భూమిలోకి చేరుస్తుంది. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.




