దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరప్ సరైన దిశలో ప్రయాణించడం లేదని, అక్రమ వలసలు పెరిగాయని, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ సరిగా లేదని ఆయన ఆరోపించారు.
అమెరికా ఆర్థిక ఇంజిన్‌గా పనిచేస్తుంటే, యూరప్ గుర్తింపు లేనిదిగా మారిందని విమర్శించారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు తప్పకుండా అవసరమని, డెన్మార్క్ దానిని రక్షించలేదని,
అమెరికా-యూరప్‌లకు గ్రీన్‌ల్యాండ్ ప్రయోజనకరమని, ఇది నాటోను కూడా బలపరుస్తుందని ట్రంప్ అన్నారు.