
స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్!
మహారాష్ట్ర ప్రభుత్వం బడి ఈడు పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాల ప్రాంగణాల్లోనూ, వాటికి 50 మీటర్ల పరిధిలోనూ జంక్ ఫుడ్ విక్రయాలు, పంపిణీ, ప్రకటనలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ ఆహార, ఔషధ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వడాపావ్, సమోసాలు, కూల్ డ్రింక్స్ వంటివి నిషేధించారు. పాఠశాల క్యాంటీన్లకు ఎఫ్డీఏ లైసెన్సులు తప్పనిసరి చేశారు. ఈ నిబంధనల అమలు బాధ్యత హెచ్ఎంలు, పాఠశాల యాజమాన్యాలదేనని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ తుకారాం ముండే తెలిపారు.




