శ్రీవారి లడ్డూ ధర పెంపు వార్తలపై టీటీడీ ఛైర్మన్ స్పందన

10090చూసినవారు
శ్రీవారి లడ్డూ ధర పెంపు వార్తలపై టీటీడీ ఛైర్మన్ స్పందన
AP: శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. లడ్డూ ధరను పెంచే ఆలోచన తమకు ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవమని కొట్టిపారేశారు. టీటీడీ ప్రతిష్ఠకు, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన తేల్చిచెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you