Top 10 viral news 🔥

తెలుగు రాష్ట్రాల్లో రానున్న3 రోజుల పాటు వర్షాలు
కర్ణాటక నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని జోగులాంబ గద్వాల, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో కోస్తా తీర ప్రాంతాల్లో, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని పేర్కొంది.




