ఏఆర్‌ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టిన TTD

23913చూసినవారు
ఏఆర్‌ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టిన TTD
శ్రీవారి లడ్డూ నాణ్యతలేదని భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈవో శ్యామలరావు స్పందించిన విషయం తెలిసిందే. నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్‌ సంస్థకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన టీటీడీ.. ఆ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టింది. 8.05 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఏఆర్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు ఏఆర్‌ సంస్థ 68 వేల కిలోల నెయ్యి సరఫరా చేసింది. ఇందులో 20 వేల కిలోల నెయ్యి నాణ్యత లేదని టీటీడీ తిప్పి పంపిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్