ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Dec 08, 2025, 07:12 IST/

VIDEO: తండ్రిని చంపిన ఏనుగును.. ఆ పిల్లలు ఏం చేశారంటే..

Dec 08, 2025, 07:12 IST
తమిళనాడులోని తిరుచెందూర్‌ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏడాది కిందట మావటిని చంపిన దేవనాయ్‌ అనే ఆడ ఏనుగుకు, ఆదివారం ఆలయానికి వచ్చిన మావటి కుమార్తెలు అక్షర, అకల్య పుచ్చకాయ, పనస, చెరకు గడలు తినిపించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. 2006 నుంచి ఆలయంలో ఉంటున్న దేవనాయ్‌ (26) గతేడాది నవంబరులో మావటి ఉదయ్‌కుమార్‌తో సహా మరో వ్యక్తిని చంపింది. దాడి తర్వాత అధికారులు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి ఏనుగును సాధారణ స్థితికి తెచ్చారు. ఈ నేపథ్యంలో కుమార్తెలు ఏనుగుకు పండ్లు తినిపించగా, ఏనుగు తొండంతో వారిని ఆశీర్వదించింది.