మహిళలకు 'తులం గోల్డ్'.. పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్!

8చూసినవారు
మహిళలకు 'తులం గోల్డ్'.. పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్!
TG: ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన మహిళలకు 'తులం బంగారం' హామీని దసరా నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కల్యాణలక్ష్మీ పథకం స్థానంలో 'తులం గోల్డ్' పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈ పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేసి, ఇకనుంచి పుస్తులు, మట్టెల రూపంలో బంగారాన్ని పేదింటి ఆడబిడ్డలకు అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. దసరా నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్