ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


గ్యాస్ కనెక్షన్లలో కీలక మార్పులు.. కేంద్రం కొత్త నిబంధనలు
Jun 03, 2026, 15:06 IST/

గ్యాస్ కనెక్షన్లలో కీలక మార్పులు.. కేంద్రం కొత్త నిబంధనలు

Jun 03, 2026, 15:06 IST
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది. ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలని నిబంధన తెచ్చింది. ఎల్పీజీ లేదా పీఎన్‌జీలలో ఏదో ఒక కనెక్షన్ మాత్రమే కలిగి ఉండాలి. పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్‌ను గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేయాలి. పీఎన్‌జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారేవారికి రీప్లేస్‌మెంట్ వోచర్ అందించాలని సూచించింది. పీఎన్‌జీ కనెక్షన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలు జూన్ లోగా పీఎన్‌జీకి మారకపోతే ఎల్పీజీ సరఫరా నిలిపివేస్తామని గతంలో ప్రకటించారు. అయితే కనెక్షన్లు రద్దు చేయడానికి గడువు ప్రకటించలేదు.