
ఏపీలో నేడు వైసీపీ ర్యాలీలు.. కేంద్ర కార్యాలయానికి చేరనున్న కోటి సంతకాలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టింది. ఈ ర్యాలీల అనంతరం తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను పంపిస్తారు. వీటిని ఈనెల 18న గవర్నర్‌కి అందజేసి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరనున్నారు. అక్టోబర్ 10న ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాలు సేకరించారు. మెడికల్ విద్య సామాన్యులకు దూరమవుతుందనే ఆందోళనతో ఈ ఉద్యమం చేపట్టినట్లు పార్టీ స్పష్టం చేసింది.




