సీఎంగా టీవీకే చీఫ్ ప్రమాణ స్వీకారం.. AI వీడియో వైరల్
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పూర్తిగా AI సృష్టించిన నకిలీవని తేలింది. వాస్తవానికి విజయ్ ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లు సాధించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్లు దూరంలో ఉంది. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.
