నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. టీవీకే చీఫ్ విజయ్ ఈరోజు ఉదయం 11 గంటలకు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలవనున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలుచుకుని, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు పూర్తి మద్దతు ప్రకటించింది. అయిన పూర్తి మెజార్టీ లేకపోవడంతో తమిళనాడులో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే.