తమిళనాడులో టీవీకే నేత ఎన్. వీర అలియాస్ వీరసామి, ఒక కాంట్రాక్టర్ వద్ద బిల్లుల క్లియరెన్స్ కోసం రూ.1.30 లక్షలు లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ గూగుల్ పే ద్వారా రూ.1 లక్ష చెల్లించగా, మిగిలిన రూ.30,000 నగదు రూపంలో వీరసామి కార్యాలయంలో అందజేశారు. లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ కావడంతో, టీవీకే పార్టీ ఆయనను బహిష్కరించింది. ఆ కాంట్రాక్టర్ డీఎంకే మద్దతుదారుడని టీవీకే నేత వీరస్వామి ఆరోపించారు. ఆయన తన వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చినట్లు చెప్పారు.