తాగిన మత్తులో చిందులేసిన TVK పార్టీ ఎమ్మెల్యే (వీడియో)

35చూసినవారు
తమిళనాడులో టీవీకే పార్టీ తరఫున తంజావూర్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విజయ్‌ శరవణన్‌ వివాదంలో చిక్కుకున్నారు. గెలుపు సంబరాల్లో భాగంగా మద్యం సేవించి, చేతిలో మందుబాటిల్‌తో రోడ్డుపక్కన డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏమిటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. గెలుపు ఆనందంలో హద్దులు దాటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.